ఇంట్రెస్టింగ్ గా రోషన్ బబుల్ గమ్ ట్రైలర్

Roshan BubbleGum Movie Trailer out now

స్టార్ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల దంపతుల తనయుడు రోషన్ వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే కదా. రవి పేరేపు దర్శకత్వంలో యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఈసినిమా వస్తుంది. నేటి యూత్ ను దృష్టిలో పెట్టుకొని కాస్త బోల్డ్ గానే ఈసినిమాను తెరకెక్కించినట్టు అర్థమవుతుంది. ఇక ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికి కారణం రోషన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అనిచెప్పొచ్చు. ఫస్ట్ సినిమానే అయినా కూడా రోషన్ చాలా ఈజ్ తో నటిస్తున్నట్టు అర్థమవుతుంది ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ను బట్టి. అందుకే ఒక్క టీజర్ తోనే సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెంచేశాడు. దానికి తోడు ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా చాలా బాగుంది. రోషన్ యాక్టింగ్, డైలాగ్స్, విజువల్స్ ఆకట్టుకున్నాయి. మరి ఈసినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈసినిమాలో మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం.. సురేష్ రగుతు సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.