థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటున్న డెవిల్ ట్రైలర్

kalyan ram devil movie trailer out now

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు కళ్యాణ్ రామ్. బింబిసార సినిమాతో కెరీర్ బ్లాక్ బస్టర్ ను అందుకున్న కళ్యాణ్ రామ్.. ఆతరువాత అమిగోస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. ఇదొక పీరియడ్‌ డ్రామా. 1940 బ్యాక్ డ్రాప్ లో బ్రిటీష్‌వారు ఇండియాను ప‌రిపాలించిన కాలానికి సంబంధించిన క‌థ‌తో ఈసినిమా వస్తుంది. ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై మొదటినుండీ అంచనాలు భారీగానే పెరిగాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా డిసెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో జోరు పెంచారు. దీనిలో భాగంగానే ఇప్పటికే టీజర్, పాటలు రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. ఓ మర్డర్ ను ఛేదించే ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు. ఈ మర్డర్ ను ఛేదించే క్రమంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు అనేది చూపించారు. అంతేకాదు శవాలు సాక్ష్యం చెప్పడం ఎక్కడైనా చూశామా.. వినయంతో ఉండటానికి.. విధేయతతో బ్రతికేయడానికి నేనేమైనా కుక్కని అనుకున్నావా అన్న డైలాగ్స్ కూడా బాగున్నాయి. మొత్తంగాా థ్రిల్లింగ్ అంశాలతో, విజువల్స్, అదిరిపోయిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు హిందీ తమిళం మరియు కన్నడ భాషలలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.