కొన్ని సినిమాలు థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకోకపోయినా ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను సొంతంచేసుకోగా ఇప్పుడు తాజాగా మరో సినిమా ఆ జాబితాలో చేరిపోయింది. ఆసినిమా మరేదో కాదు కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన రూల్స్ రంజన్ సినిమా. రత్నం కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా అక్టోబర్ 6వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ యాక్షన్ డ్రామా జోనర్ లో వచ్చిన ఈసినిమా మంచి విజయాన్ని అయితే అందుకోలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఇప్పటికే ఓటీటీలోకి కూడా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్, ఆహా వారు సొంతం చేసుకోగా నవంబర్ 30 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఓటీటీ లో మాత్రం ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే 72 మిలియన్ మినిట్స్ కి పైగా స్ట్రీమింగ్ అవుతూ, మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. దీంతో రూల్స్ రంజన్ ఓటిటి లో మంచి రెస్పాన్స్ వస్తుండటంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈసినిమాలో నేహాశెట్టి హీరోయిన్ గా నటించగా..హైపర్ ఆది, వైవా హర్ష, సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దివ్యంగ్ లావానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























