బిగ్ బాస్ 7.. శివాజీ, శోభా బిగ్ ఫైట్

bigg boss season 7 big fight between shoba and shivaji

బిగ్ బాస్ సీజన్ 7 ఇంకో వారంరోజుల్లో పూర్తయిపోతుంది. సాధారణంగా చివరి దశలో హౌస్ మేట్స్ అందరూ ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా వీలైనంత వరకూ అందరితో కూల్ గా ఉండటానికే ట్రై చేస్తుంటారు. కానీ ఈ సీజన్ ఉల్టా పుల్టా అంటూ ఎలా మొదలైందో లాస్ట్ స్టేజ్ లో కూడా ఫుల్ గొడవలతో సీజన్ ను బ్లాక్ బస్టర్ ను చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం హౌస్ లో ఓటు అప్పీల్ కోసం గేమ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఇప్పటికే శోభ, అర్జున్ ఓటు అప్పీల్ చేసుకున్నారు. ఇక మొన్న ఎపిసోడ్ లో మరో గేమ్ పెట్టాడు. ఒక బోర్డర్ లైన్ పెట్టి అందులోనే ఉండి కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు బాల్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఎవరికి ఎక్కువ బాల్స్ అంటుకుంటాయో వారు గేమ్ నుండి అవుటయిపోతారు. ఇక ఈ గేమ్ లోనే ప్రశాంత్-అమర్ మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ప్రశాంత్ పై అమర్ దురుసుగా ప్రవరిస్తాడు. ముందు రౌండ్లో శోభ, యావర్ తప్పుకోగా సెకండ్ రౌండ్ లో ప్రశాంత్- అమర్ తప్పుకుంటారు. ఆ తరువాత ఈ గేమ్ లోనే సంచాలకురాలిగా ఉన్న శోభ రౌండ్ కో రూల్ మార్చుతుందని శివాజీ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. శివాజీ-శోభ మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. అంతేకాదు గేమ్ జరుగుతున్నప్పుడు శోభా.. ప్రియాంకను ఎంకరేంజ్ చేస్తుంటుంది.. దీంతో శివాజీ చిరాకు వచ్చి గేమ్ నుండి తప్పుకుంటాడు. చివరిగా ప్రియాంక, అర్జున్ ఈ టాస్క్ ను ఆడగా.. ఈ గేమ్ లో అర్జున్ గెలుస్తాడు. ఆతరువాత మరో ఫన్నీ గేమ్ ఇస్తాడు. తలపై ఉన్న క్యాప్ తో బెలూన్స్ ను బ్రేక్ చేయాలి.. ఆ క్రమంలో బెలూన్సూ నుండి కింద పడే వాటిలో క్యాండీస్ ను కలెక్ట్ చేయాలి. ఈ గేమ్ లో శివాజీ గెలుస్తాడు.

ఇక అర్జున్, శివాజీకి ఓటు అప్పీల్ ఛాన్స్ వస్తుంది. అయితే అప్పటికే అర్జున్ కు ఓటు అడిగే ఛాన్స్ రావడంతో అందరూ శివాజీకే ఛాన్స్ ఇస్తారు. దీంతో శివాజీ ఓటు అప్పీల్ చేసుకుంటాడు. ఆ తరువాత బిగ్ బాస్ ఓ యాడ్ కు సంబంధించిన టాస్క్ ఇస్తాడు. ఇందులో ప్రియాంకను, శోభాను వండర్ ఉమెన్ గాా తయారు చేయమని చెబుతాడు. దీనికి సంచాలకులుగా అమర్ ను ఉంచుతాడు. ఈ టాస్క్ లో భాగంగా శివాజీ-ప్రశాంత్ ప్రియాంకను..యావర్-అర్జున్ శోభా కు తయారు చేస్తారు. అయితే అమర్ ప్రియాంకను విన్నర్ గా ప్రకటిస్తాడు. ఇక అమర్ డెసిషన్ తో ప్రియాంక అసహనం వ్యక్తం చేస్తుంది. అక్కడ ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. దీంతో అమర్ స్పై బ్యాచ్ ను చూసి నేర్చుకోవాలి మనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దాంతో శుక్రవారం ఎపిసోడ్ ముగుస్తుంది.

మరి ఈవారం ఎవరు హౌస్ నుండి ఇంటికి వెళతారు.. అసలు ఎలిమినేషన్ ఉంటుందా అన్నది తెలియాలంటే వీకెండ్ ఎపిసోడ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 15 =