నాని హాయ్ నాన్న బాక్సాఫీస్ వద్ద మెల్లి మెల్లిగా జోరు పెంచుకుంటూ పోతుంది.రివ్యూస్ పాజిటివ్ గా వచ్చిన మౌత్ టాక్ ఎక్సలెంట్ గా వున్నా తొలి రెండు రోజులు అంతమాత్రంగానే కలెక్షన్లు రాబట్టుకుంది కానీ ఈరోజు మాత్రం సాలిడ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడంతో మొదటి రెండు రోజుల కన్నా ఎక్కువ వసూళ్లను రాబట్టుకోనుంది.ఇక మూడు రోజుల్లో హాయ్ నాన్న ప్రపంచ వ్యాప్తంగా 17కోట్ల గ్రాస్ ను వసూళ్లను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో స్లోగా వున్నా యూఎస్ లో మాత్రం సాలిడ్ వసూళ్లను దక్కించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటివరకు అక్కడ 700k డాలర్లకు పైగా రాబట్టింది.రేపటి తో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరనుంది.నానికి ఇది 9వ మిలియన్ డాలర్ మూవీ కానుంది.ఓవరాల్ గా అయితే హాయ్ నాన్న బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకో 20కోట్ల వరకు రాబట్టాల్సిందే.రేపు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే వున్నాయి.వచ్చే వారం ఇదే జోరు కొనసాగిస్తే టార్గెట్ ను చేరుకోవడం కష్టమేమి కాదు.
బ్యూటిఫుల్ ఎమోషనల్ లవ్ డ్రామాగా శౌర్యువ్ తెరకెక్కించిన ఈసినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా బేబీ కైరా ఖన్నా నాని కూతురిగా కనిపించింది.హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించాడు.వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























