సందీప్ రెడ్డి వంగా.. ఈ తెలుగు డైరెక్టర్ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’గా తెరకెక్కించిన ఆయన.. తన తదుపరి సినిమాకు కూడా మళ్ళీ బాలీవుడ్‌నే ఎంచుకున్నాడు. ఈసారి రణ్‌బీర్ కపూర్ హీరోగా హిందీలో ‘యానిమల్’ సినిమాను రూపొందించి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి సంచలన విజయాన్ని అందుకున్నాడు. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. బాలీవుడ్ స్టార్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో యానిమల్ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం సందీప్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. దీనిలో భాగంగా అక్కడ ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన సినిమాకు సంబంధించి అనేక విషయాలను, అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సందీప్ వంగా మాట్లాడుతూ.. “ఇప్పటివరకూ జరిగిన ఈ చర్చా కార్యక్రమం అద్భుతంగా నడిచింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వారిలో నాకు నచ్చిన విషయం ఏంటంటే.. మహిళలపై ద్వేషం గురించి ఎవరూ ప్రశ్నలు వేయలేదు. మీరు సరైన ప్రేక్షకులు. మీరు యానిమల్‌ను ఓ సినిమాలానే చూశారు. నాకు చాలా సంతోషంగా ఉంది” అని సందీప్ వంగా చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “భవిష్యత్తులో అవకాశం వస్తే.. మెగాస్టార్ చిరంజీవితో తప్పకుండా ఓ మూవీ చేయాలని అనుకుంటున్నా. ఎందుకంటే, మెగాస్టార్ తో కలిసి వర్క్ చేయాలని నాకు ఎప్పటినుంచో కోరిక. అయితే ఆయనతో చేయబోయే సినిమా ఒక మంచి యాక్షన్ డ్రామాగా చేసేందుకు ఇష్టపడతా” అని పేర్కొన్నారు. కాగా తనకు చిరంజీవి అంటే ఇష్టమని, తన ఫెవరెట్ హీరో చిరు అని సందీప్ వంగా గతంలోనే వెల్లడించారు. ఇక యానిమల్ సినిమాలో హింస ఎక్కువగా ఉందని, కొన్ని సన్నివేశాల్లో మహిళలను కించపరిచే విధంగా చూపించారని పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, ఈ చిత్రం సమాజంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని విమర్శలు గుప్పిస్తుండటంపై స్పందిస్తూ.. మూవీస్ వేరు, రియల్ లైఫ్ వేరు అని, సినిమాను సినిమాలాగే చూడాలని డైరెక్టర్ సందీప్ వంగా పేర్కొన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్డ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: