తమని ఎంతగానో అభిమానించే అభిమాని కోసం ఒక సెలబ్రిటీ ఆడే ఆట ‘ఉస్తాద్’, ఇంత గొప్ప కాన్సప్ట్ ని హోస్ట్ చేయడం చాలా ఆనందంగా వుందిని పేర్కొన్నారు రాక్ స్టార్ మంచు మనోజ్. ఈ మేరకు ఆయన హోస్ట్‌గా ‘ఉస్తాద్’ ర్యాంప్ ఆడిద్దాం.. పేరిట సరికొత్త టాక్ షో ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ టాక్ షో డిసెంబర్ 15 నుంచి ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది. ఈనేపధ్యంలో ప్రోమో రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రోమో రిలీజ్ ఈవెంట్ లో మంచు మనోజ్ మాట్లాడుతూ.. “ఏడేళ్ళ గ్యాప్ తర్వాత ఏడు అడుగులేసి మళ్ళీ ఇండస్ట్రీలోకి రావడం చాలా ఆనందంగా వుంది. ఇంతకుముందు సినిమాలు చేయాలనే ప్యాషన్, గోల్ తో చేశాను. ఈ ఏడేళ్ళు మీరు చూపించిన భాద్యతగా మారింది. ఇప్పుడు ప్యాషన్ కంటే భాద్యతతో వచ్చాను. గ్యాప్ తీసుకున్నందుకు ఫ్యాన్స్ నన్ను క్షమించాలని కోరుతున్నాను. కానీ ఈసారి థౌజండ్ కాదు లక్ష కోట్లవాలా పటాకులు పేలబోతున్నాయి. అలాంటి టీం దొరికింది. ఈటీవీ నుంచి రామోజీరావు గారు, బాపినీడు గారు, సాయి కృష్ణ, నితిన్, సాయి కిరణ్ అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి టీజీ విశ్వ ప్రసాద్ గారు, వివేక్ కూచిబొట్ల గారు ఎంతో సపోర్ట్ చేశారు” అని పేర్కొన్నారు.
“ఈ షో కాన్సప్ట్ నాకు చాలా నచ్చింది. ఇదొక సెలబ్రిటీ గేమ్ షో. తమని ఎంతగానో అభిమానించే ఫ్యాన్ కోసం ఒక సెలబ్రిటీ ఆడే ఆట ఇది. ఫ్యాన్ కోసం సెలబ్రేటీ ఆట ఆడి వాళ్ళకు డబ్బు ఇవ్వడం అనేది చాలా గొప్ప కాన్సప్ట్. ఈ ఆటలో సెలబ్రిటీ గెలుచుకున్న మొత్తాన్ని ఆ అభిమానికి ఇచ్చేస్తాం. అదే ఈ షో స్పెషాలిటీ. ప్రైజ్ మనీ వచ్చేసి.. రూ.50 లక్షలు, స్పెషల్ గిఫ్ట్‌లు కూడా ఉంటాయి. ఫ్యాన్స్ కి దగ్గరగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఈ షో మొదలుపెట్టాం. ఈషో అంతా ఒక కుటుంబంలా పెరుగుతుంది. షో అద్భుతంగా వచ్చింది. ఇది ఆరంభం మాత్రమే. మళ్ళీ పుట్టాను మీ ముందుకు వచ్చాను. కమ్ బ్యాక్ అనగానే చాలా అవకాశాలు వచ్చాయి. అయితే ఏదైనా కొత్తగా చేయాలనే తపన ఎప్పుడూ వుంది. ఆ తపనతోనే ఈ షో ఒప్పుకున్నాను. కలిసి ముందుకు వెళ్దాం ర్యాంప్ ఆడిద్దాం. అందరికీ ధన్యవాదాలు” అని తెలిపారు మంచు మనోజ్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































