ఆపరేషన్ వాలెంటైన్ కొత్త రిలీజ్ డేట్ అప్ డేట్

operation valentine movie release date postponed

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు అయిన శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యదార్ధ సంఘటన ఆధారంగా రూపొందిన ఈసినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపించనున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి ఈసినిమాను డిసెంబర్ 8వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే చిత్రయూనిట్ తెలిపింది. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ రాకపోవడంతో సినిమా రిలీజ్ పై అనుమానాలు మొదలయ్యాయి. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కొన్ని అనివార్య కారణాల వల్ల చెప్పిన తేదీకి ఆపరేషన్ వాలెంటైన్ సినిమాను విడుదల చేయలేకపోతున్నాము.. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తాం అని తాజాగా అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.

కాగా ఈసినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.