ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే హీరోలు మాత్రం ఒకరి పట్ల ఒకరు స్నేహపూర్వకంగా మెలుగుతూనే ఉంటారు. మన టాలీవుడ్ లోనే చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండే హీరోలు ఉన్నారు. కొంతమంది తమ బాండింగ్ ను చెప్పుకుంటారు.. కొంతమంది చెప్పుకోరు. కొన్ని కొన్ని బాండింగ్ లు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే చోటుచేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు నాని. సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేయాలని తెలుగుతో పాటు పలు చోట్లకు వెళుతున్నాడు. పలు ఈవెంట్లలో పాల్గొంటున్నాడు. మరోవైపు సోషల్ మీడియా ద్వారా కూడా నెటిజన్లకు దగ్గరగా ఉంటున్నాడు. దీనిలో భాగంగానే తన సోషల్ మీడియా ద్వారా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను నిర్వహించాడు. ఈనేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మీది తారక్ అన్నది అన్‌సీన్ పిక్ రివీల్ చేయండి అన్న ప్లీజ్ అని అడిగాడు. వెంటనే నాని ఒక ఇమేజ్‌ను ట్వీట్ చేశారు. ‘ఇది ఓకేనా?’ అని కామెంట్ చేశారు. ఈ ఫొటోలో నాని, ఎన్టీఆర్ ఒకరికొనరు గట్టిగా హగ్ చేసుకొని ఉన్నారు. ఈ ఫొటో కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అటు నాని అభిమానులు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు ఇద్దరూ ఈ ఫొటోను చూసి హ్యాపీగా ఫీలవుతున్నారు.
Idhi ok aa ? 🙂#AskNani #HiNanna https://t.co/3yyBPAXCMx pic.twitter.com/f4G2fxijvt
— Hi Nani (@NameisNani) December 4, 2023
ఇక ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.వి.మోహన్, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































