జయాపజయాలతో పనిలేకుండా నితిన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే ఈమధ్య కాలంలో నితిన్ సరైన విజయం సాధించలేకపోయాడు. ఎప్పటినుండో మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అయితే నితిన్ నుండి రాబోతున్నసినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ. స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా షూటింగ్ కూడా ఓ మాస్ సాంగ్ షూట్ తో షూటింగ్ పూర్తయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనలు కూడా పూర్తి చేస్తుంది. ఇక ఇదిలా ఉంగా ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ రిలీజ్ చేశారు. అంతేకాదు పాటలు కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది.
A glimpse into the world of EXTRA fun, action and entertainment awaits you🥳💥https://t.co/CclXrs5maW#ExtraTrailer out now!#ExtraOrdinaryMan#ExtraOrdinaryManOnDec8th@actor_nithiin @ActorRajasekhar @sreeleela14 @vamsivakkantham @Jharrisjayaraj pic.twitter.com/mSxgQT1bpy
— Sreshth Movies (@SreshthMovies) November 27, 2023
కాగా ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























