బిగ్ బాస్ 7- కెప్టెన్సీ టాస్క్ రద్దు చేసిన బిగ్ బాస్

bigg boss season 7 telugu day 82 highlights

బిగ్ బాస్ 7.. ప్రస్తుతం హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. గత రెండు రోజులుగా ఈ టాస్కే జరుగుతుంది. ఇక ఈ టాస్క్ అంత ఎంటర్ టైనింగ్ గా లేకపోవడంతో ఆపేస్తాడు బిగ్ బాస్. ఆ తరువాత హౌస్ ఆఖరి కెప్టెన్ కోసం మరో గేమ్ పెడతాడు బిగ్ బాస్. పాయింట్ బ్లాంక్ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో రెండు ఫొటోలను ఒక దగ్గర పెడతాడు బిగ్ బాస్. ఆ తరువాత ఇద్దరు కంటెస్టెంట్లు వచ్చి కెప్టెన్ కు ఎవరు అనర్హులో చెప్పి వారి ఫొటోను కాల్చాల్సి వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ టాస్క్ లో ముందుగా గౌతమ్, ప్రియాంక రాగా వారికి శోభా, అర్జున్ ఫొటోలు పెట్టగా ఇద్దరూ శోభా ఫొటోను తీసేద్దామని ఫిక్స్ అవుతారు. దీంతో శోభా కెప్టెన్సీ నుండి తప్పుకోవాల్సి ఉంటుంది. ప్రశాంత్, శోభాశెట్టి ఇద్దరికీ అశ్విని, అమర్ ఫొటోలు రాగా ఇద్దరూ అమర్ కు సపోర్ట్ చేయడంతో అశ్విని ఫొటో కాలిపోతుంది. ఆ తరువాత యావర్, రతికలకు శివాజీ, ప్రశాంత్ పేర్లు రాగా ఇద్దరూ ప్రశాంత్ పేరును సెలక్ట్ చేసుకోవడంతో శివాజీ కెప్టెన్సీ రేసుకు వెళతాడు. అనంతరం శివాజీ, అశ్విని రాగా వారికి యావర్, అర్జున్ పేర్లు వస్తాయి. ఆ ఇద్దరిలో యావర్ ను తప్పిస్తారు. ఆ తరువాత అమర్, అర్జున్ రాగా వీరికి ప్రియాంక, శివాజీ ల ఫొటోలు వస్తాయి. వీరిద్దరూ ప్రియాంకను తప్పిస్తారు. ఆ తరువాత యావర్, రతిక కు గౌతమ్, అర్జున్ పేరు రాగా గౌతమ్ తనంతట తానే తప్పుకోవడానికి అంగీకరించడంతో రేస్ నుండి తప్పుకుంటాడు. ఆ తరువాత వచ్చిన ప్రియాంక, అశ్విని.. రతిక, అమర్ లలో రతిక పేరు తీసేస్తారు. ఆ తరువాత అమర్, గౌతమ్ కు శివాజీ, అర్జున్ పేర్లు రాగా శివాజీ ఫొటోను తీసేస్తారు. ఫైనల్ గా శివాజీ, శోభా రాగా వారికి అమర్, అర్జున్ పేర్లు వస్తాయి. ఇక వీరిద్దిలో శోభా అమర్ కు సపోర్ట్ గా రాగా.. శివాజీ అర్జున్ కు సపోర్ట్ గా వస్తాడు. ఇద్దరి మధ్య చాలాసేపు చర్చలు జరుగుతాయి. అయినా కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోవడంతో అమర్, అర్జున్ ఇద్దరి ఫొటోలు కాలిపోతాయి. దీంతో ఎవరూ కెప్టెన్ కాకుండా అయిపోతారు.

ఇదిలా ఉండగా టాస్క్ జరగుతున్నంత సేపు అమర్ తనకు కెప్టెన్సీ ఇవ్వమని.. సపోర్ట్ చేయమని అడుగుతూనే ఉంటాడు. గత వారమే కెప్టెన్సీ కోసం చాలా ఎమోషనల్ అవుతాడు. నిన్న కూడా ఎమోషనల్ అవుతాడు. కానీ అమర్ కు మాత్రం ఆ ఛాన్స్ రాలేదు. మరి దీనిపై నేడు నాగార్జున ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో ఎవరు హౌస్ నుండి ఇంటికి వెళతారు.. డబల్ ఎలిమినేషన్ ఉంటుందా?లేదా అన్న విషయాలు తెలియాలంటే ఈరోజు వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.