మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ ఇంటెన్స్ అండ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ థియేట్రికల్ రాకకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ట్యాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకు సిద్ధమవుతోంది. మూవీ రిలీజ్ కు కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో మేకర్స్ మరింత దూకుడు పెంచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు మరో 50 రోజులే సమయం ఉండటంతో.. తాజాగా మేకర్స్ ఈగల్ నుంచి రవితేజ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ 50 డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్లో రవితేజ డెస్క్‌పై చాలా ఆయుధాలతో కనిపించారు. స్టైలిష్ డ్రెస్సింగ్ లో చాలా ఇంటెన్స్ లుక్ లో ఆకట్టుకున్నారు. ఈసినిమాలో రవితేజ మల్టీ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఇటీవలే రిలీజైన ‘ఈగల్’ టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో క్యూరియాసిటీ పెంచింది.
ఇక ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తుండగా, అనుపమ పరమేశ్వరన్ మరో కథానాయికగా నటించింది. శ్రీనివాస్ అవసరాల, మధుబాల, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, భాషా, శివ నారాయణ, మిర్చి కిరణ్, నితిన్ మెహతా, ధ్రువ, ఎడ్వర్డ్, మద్ది, జరా, అక్షర ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని ఎడిటింగ్ మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మణిబాబు కరణంతో పాటు దర్శకుడు స్వయంగా స్క్రీన్ ప్లే రాయగా.. మణిబాబు కరణం డైలాగ్స్ అందించారు. అలాగే దేవ్‌జాంద్ సంగీత సమకూరుస్తుండగా.. శ్రీనాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























