బిగ్ బాస్ 7- కెప్టెన్సీ టాస్క్ కోసం కంటెస్టెంట్ల పాట్లు

bigg boss season 7 telugu day 81 highlights

బిగ్ బాస్ 7 ప్రస్తుతం హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న అనంతరం మరో టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ లో బిగ్ బాస్ మిసెస్ మర్డర్ జరిగిందని..మర్డరర్ ని కనిపెట్టాలనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో అమర్-అర్జున్ ను ఇంద్రజిత్-కామజిత్ అంటూ ఇన్వెస్టిగేషన్ ఆపీసర్స్ గా నియమించాడు. అశ్విని-శోభాశెట్టిని రిపోర్టర్స్ గా, రతిక-గౌతమ్ సీక్రెట్ ప్రేమ జంటగా.. యావర్-ప్రియాంకలను పనిమనుషులుగా నియమించారు. శివాజీకి సీక్రెట్ టాస్క్ ఇస్తాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక గురువారం ఎపిసోడ్ కూడా మొదలైంది. హౌస్ లో కంటెస్టెంట్ లు ఎవరికి ఇచ్చిన రోల్స్ లో వాళ్లు చేసుకుంటూ వెళుతుంటారు. అప్పటికే సీక్రెట్ టాస్క్ లో భాగంగా శివాజీ ప్రశాంత్ ను స్టోర్ రోమ్ కి వెళ్లమని చెప్పడంతో వెళతాడు. దాంతో ప్రశాంత్ మర్డర్ అవుతాడు. ఈనేపథ్యంలోనే అమర్, అర్జున్ ప్రశాంత్ ను ఎవరు హత్య చేశారో తెలిస్తే మర్డర్ చేసింది ఎవరో తెలుస్తుంది అని ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేస్తుంటారు.

ఇంతలో శివాజీకి మరో మర్డర్ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. టాస్క్ లో భాగంగా క్రయింగ్ బేబీ అశ్విని గెటౌట్ అని ఎవరూ చూడకుండా అద్దం పై రాయాలి. ఈ టాస్క్ లో కూడా శివాజీ సక్సెస్ అవుతాడు. అశ్విని కూడా మర్డర్ అయి దెయ్యం గెటప్ వేస్తుంది. మరోవైపు శివాజీ మీద హౌస్ మేట్స్ కు అనుమానం వస్తుంది. ఈ క్రమంలో అమర్ శివాజీ వాడిన పేస్ట్ ను తీసుకొచ్చి దీనికి ఒక వెంట్రుక ఉందని.. అది తెల్ల వెంట్రుక అని శివాజీ గారిది అయి ఉంటుందని చెబుతాడు.

అనంతరం శివాజీకి మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈసారి గౌతమ్ ను చంపాలని.. ఐయామ్ డెడ్ అనే స్టికర్ ను గౌతమ్ కు అంటించాలని చెబుతాడు. అయితే ఈ టాస్క్ ను శివాజీ కంప్లీట్ చేయలేకపోతాడు. దీంతో శివాజీ నుండి సీక్రెట్ టాస్క్ ను ప్రియాంకకు ఇవ్వమని చెబుతాడు బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ చెప్పినట్టు శివాజీ తన సీక్రెట్ టాస్క్ ను ప్రియాంకను ఇస్తాడు. అయితే మొదట శివాజీ గారి మీద అనుమానం వచ్చినా ఆ తరువాత ప్రియాంక నిజమే అని నమ్మి తన టాస్క్ ను చాలా ఈజీగా పూర్తి చేస్తాడు. ఇలా మర్డర్ లు జరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టిగేటర్లు ఇదంతా చేసేది రతిక అని చెప్పి ముందు జైలులో వేస్తారు. ఆ తరువాత రతిక కాదని శివాజీనే అని డిసైడ్ అవుతారు. మరి ఫైనల్ గా అసలు మర్డరర్ ఎవరనేది తెలుసుకుంటారా లేదా? అనేది చూడాలి?

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.