విష్ణు మంచు బర్త్ డే సందర్భంగా.. కన్నప్ప ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Vishnu Manchu Birthday First Look Poster Released From Kannappa

టాలీవుడ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. స్టార్‌ ప్లస్‌లో ప్రసారమయ్యే ‘మహాభారత్‌’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తుండగా.. భారతదేశంలోని స్టార్ కాస్టింగ్ భాగం కానుంది. దీనిలో భాగంగా మాలీవుడ్ నుంచి మోహన్‌లాల్, శాండల్ వుడ్ నుంచి శివ రాజ్‌కుమార్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్ వంటి అగ్రనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇంకా విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు సైతం మరో కీ రోల్‌ను పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు కూడా తెలుస్తోంది. ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి ఓ స్టార్ యాక్టర్ ‘కన్నప్ప’లో నటించనుండటంతో ఈ సినిమా నేషనల్ వైడ్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌లోని అందమైన లొకేషన్లలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. అక్కడి ప్రకృతి దృశ్యాలు ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నాయి. దాదాపు 80 శాతం షూటింగ్ ఇక్కడ జరుపనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ బయటకు వచ్చింది.

గురువారం (నవంబర్ 23, 2023) మంచు విష్ణు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ‘కన్నప్ప’ నుంచి ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. దీనికి సంబంధించి మేక‌ర్స్‌ బుధవారమే అప్‌డేట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత కాలమాన ప్రకారం ఈరోజు వేకువఝామున 2.45 గం.లకు (న్యూజిలాండ్‌ కాలమాన ప్రకారం10.15 గం.లకు) సినిమా ఫ‌స్ట్ లుక్‌ రిలీజ్ చేశారు. ఇక ఇందులో విష్ణు ‘క‌న్న‌ప్ప’గా అద్భుతమైన లుక్‌లో కనిపించారు. ఓ వైపు నుంచి బాణాలు త‌న పైకి దూసుకు వ‌స్తుండగా.. విష్ణు ఆకాశంలోకి చూస్తు విల్లును ఎక్కుపెట్టి బాణాలు వేస్తున్న‌ట్లుగా ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే.. ‘కన్నప్ప’ను ఓ రేంజ్‌లో తెర‌కెక్కిస్తున్న‌ట్లు ఆర్థ‌మ‌వుతోంది. కాగా ఈ ఫ‌స్ట్ లుక్‌ రిలీజ్ తరువాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

కాగా ‘కన్నప్ప’ చిత్రాన్ని ‘అవా ఎంటర్టైన్మెంట్‌’ మరియు ’24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ’ పతాకంపై మంచు మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా స్క్రిప్ట్‌కు సీనియర్‌ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, విజయేంద్ర ప్రసాద్, బుర్రా సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌, నాగేశ్వర రెడ్డి, ఈశ్వర్ రెడ్డి తదితరులు తుది మెరుగులు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. అలాగే.. ‘బాహుబలి’, ‘జవాన్’, ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి భారీ ప్రాజెక్టు‌లకు ఫైట్స్ కంపోజ్ చేసిన హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెచా ఈ సినిమాలో పోరాట సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అత్యంత భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే యేడాది పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషలలో గ్రాండ్‍గా రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.