సీనియర్ హీరో వెంకటేష్,హిట్ ఫేమ్ శైలేష్ కొలను కాంబినేషన్ లో వస్తున్న సినిమా సైంధవ్.వెంకీకి ఇది 75వ సినిమా.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.చాలా రోజుల తరువాత వెంకీ యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు.ఇటీవల రిలీజైన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు పెరిగిపోయాయి.ఇక ఈసినిమా నుండి సాంగ్స్ విడుదలకానున్నాయి.అందులో భాగంగా మొదటి పాట రాంగ్ యూసేజ్ ను ఈనెల 21న విడుదలకానుంది.ఈ సందర్భంగా సాంగ్ నుండి వెంకీ స్టెప్ వేసిన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈ సాంగ్ ను చంద్రబోస్ రచించగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Wishing everyone a sparkling Diwali❤️
Kick-starting the celebrations with #SAINDHAV First single #WrongUsage on NOV 21st 🎶❤️🔥#SaindhavOnJAN13th 💥
Victory @VenkyMama @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh… pic.twitter.com/TJrP0Y8xrX
— Niharika Entertainment (@NiharikaEnt) November 12, 2023
ఈసినిమాలో శ్రద్దా శ్రీనాథ్ ,ఆండ్రియా,రుహాణి శర్మ,తమిళ నటుడు ఆర్య,బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రలు చేస్తున్నారు.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా నిహారిక ఎంటెర్టైమెంట్స్ నిర్మిస్తుంది.వెంకటేష్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా.
ఇక ఈసినిమా సంక్రాంతి కి విడుదలవుతుంది.అదే టైంలో గుంటూరుకారం,నా సామిరంగ ,ఫ్యామిలీ స్టార్ వంటి పెద్ద సినిమాలు కూడా వస్తున్నాయి.మరి ఈపోటీని సైంధవ్ ఎలా అధిగమిస్తాడో చూడాలి.సైంధవ్ జనవరి 13న పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























