ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘యాత్ర’. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదలై మంచి విజయం అందుకుంది. వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. వైఎస్సార్ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారని చెప్పవచ్చు.. నడకలో, బాడీ లాంగ్వేజ్‌లో, హావభావాల్లో వైఎస్సార్‌ను దించేశారు మమ్ముట్టి. ఇక వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పాత్రలో సీనియర్ నటుడు జగపతి బాబు, వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్ నటించారు. అలాగే సీనియర్ నాయకురాలు గౌరు చరిత క్యారెక్టర్‌లో నటి అనసూయ కీలక పాత్రలో కనిపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘యాత్ర 2’ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వైఎస్సార్ తనయుడు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‌గా ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇప్పటికే ‘యాత్ర 2’ నుంచి మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్ విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో కీలక అప్డేట్ ఇచ్చారు. ‘యాత్ర 2’లో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీల పాత్రలు కూడా ఉండనున్నాయి. చంద్రబాబు పాత్రలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు మహేష్ మంజ్రేకర్ నటిస్తుండగా.. సోనియా గాంధీ పాత్రలో జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ కనిపించనున్నారు.
ఇప్పటికే పాత్రకి సంబంధించి కొంతభాగం షూటింగ్ కూడా జరుగగా.. మంగళవారం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు డైరెక్టర్ మహీ వి. రాఘవ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అందులో.. ‘మీరు అతన్ని ఓడించలేకపోతే.. అతన్ని నాశనం చేయండి’ అని ఉన్న ఒక ట్యాగ్‌లైన్‌ను జోడించారు. ఇక ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. కాగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ వైఎస్ ఫ్యామిలీ ఇలాకా అయిన పులివెందులలో జరిగింది. మేజర్ షెడ్యూల్‌లో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగా నటిస్తున్న జీవాపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన ఆంధ్రాలో చేసిన పాదయాత్ర సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ క్రమంలో జీవా, వైఎస్ జగన్‌గా నటించడం కాదు, జీవించేస్తున్నాడు అని టాక్ నడుస్తోంది.
Their Paths crossed,
The Dynasty Collapsed,
The History changed !#Yatra2 #Yatra2OnFeb8th #LegacyLivesOn @ShivaMeka @Music_Santhosh @madhie1 #SelvaKumar @vcelluloidsoffl @3alproduction pic.twitter.com/GdVNLcIFsO— Mahi Vraghav (@MahiVraghav) November 7, 2023
అయితే ‘యాత్ర 2’లో ప్రధానంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిజ జీవితంలో చోటుచేసుకున్న కీలక ఘట్టాలను చూపించనున్నారు. ముఖ్యంగా.. జగన్ రాజకీయ రంగప్రవేశం, అందుకు దారి తీసిన పరిస్థితులు, సొంతంగా వైఎస్సార్సీపీ పార్టీని స్థాపించడం, ప్రతిపక్షనాయకుడిగా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేపట్టడం.. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవడం వంటివాటిని విపులంగా వివరించనున్నారు. కాగా పొలిటికల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సీక్వెల్‌ను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ బ్యానర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా 2024 ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























