షారుఖ్ ఖాన్ బర్త్ డే సందర్భంగా.. డంకీ టీజ‌ర్ రిలీజ్

Shah Rukh Khan Drops Dunki Movie Teaser on His Birthday

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటిస్తోన్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘డంకీ’. నేషనల్ అవార్డ్ విన్నర్ తాప్సీ పన్ను హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఆయన ఇంతకుముందు ‘మున్నాభాయ్ ఎం.బీ.బీ.ఎస్’, ‘త్రీ ఇడియట్స్’ ‘పీకే’, వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల తీసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌లో హిరానీ, గౌరీ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబ‌ర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఈరోజు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సంద‌ర్భంగా.. ఈ మూవీ నుంచి సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. కింగ్ ఖాన్ ఫ్యాన్స్ కోసం ‘డంకీ’ మూవీ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. కాగా ‘డంకీ’ టీజర్ చూస్తుంటే.. ఇల్లీగల్‌గా యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్), కెనడా వంటి అగ్ర దేశాలకు సరైన అనుమతులు, ధ్రువ పత్రాలు లేకుండా వెళ్లాలనుకునేవారు ఎలాంటి కష్టాలని ఎదుర్కొన్నారు? అనే విషయాలను ఇందులో ప్రధానంగా చూపించారు. ఇక ఇండియా నుంచి ఇంగ్లాండ్‌కు చట్టవిరుద్ధంగా వెళ్లే షారుఖ్ అండ్ అతని గ్యాంగ్‌కు ఎదురయ్యే సమస్యలు ఏంటి అనేది డంకీ క‌థ అని టీజ‌ర్ చూస్తే అర్థమవుతుంది. రాజ్ కుమార్ హిరానీ మేకింగ్ తరహాలోనే ‘డంకీ’లో కూడా ఫుల్ ఫన్ ఉంటుంద‌ని తెలుస్తోంది. డ్రామా, రొమాన్స్ జాన‌ర్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో కథానాయకుడు హార్డీగా షారుఖ్ ఖాన్ న‌టిస్తుండ‌గా.. హీరోయిన్ మను పాత్రలో తాప్సి కనిపించింది.

ఇక ఈ ఏడాది షారుఖ్‌ఖాన్‌ అద్భుతమైన స‌క్సెస్‌ అందుకున్నారు. ‘ప‌ఠాన్’, ‘జవాన్‌’ చిత్రాల‌తో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ముందుగా ఈ ఏడాది ఆరంభంలో వ‌చ్చిన ‘ప‌ఠాన్’ సినిమా రూ.1000 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు సాధించి రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న షారుఖ్ కి సాలిడ్ హిట్ అందించింది ఈ సినిమా. అంతేకాకుండా గడచిన కొన్నేళ్లుగా దక్షిణాది చిత్రాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో.. ఒక హిందీ సినిమా ఈ ఫీట్ సాధించడం గమనార్హం. దీనితర్వాత ఇటీవలే విడుద‌లైన ‘జవాన్‌’సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించారు కింగ్ ఖాన్. ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.1150 కోట్లు కొల్లగొట్టింది. ఇలా ఒకే సంవత్సరంలో 2 రూ.1000 కోట్ల‌ సినిమాలను అందించిన ఏకైక ఇండియన్ హీరోగా షారుఖ్ మరో రికార్డ్ సాధించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.