కోలీవుడ్‌లోని టాప్ కమెడియన్స్‌లో యోగిబాబు ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలందరూ యోగిబాబు తమ సినిమాలో తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటారంటే అతిశయోక్తి కాదు. కాగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కి చెన్నై అంటే ప్రత్యేక అభిమానం. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి కెప్టెన్‌గా ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ధోనీ ఇటీవల తన సతీమణి సాక్షి సింగ్‌తో కలిసి ‘ధోనీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్’ను ప్రారంభించాడు. ఈ క్రమంలో ఈ బ్యానర్ నుంచి నిర్మించిన తొలి సినిమా ‘ఎల్జీఎం’. ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ అనేది ఉప శీర్షిక. తమిళంలో రూపొందిన ఈ సినిమాలో యోగిబాబు కీలక పాత్ర పోషించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జూలై 28న విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అయితే సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఈ మూవీ చిత్రీకరణ సమయంలో నటుడు యోగిబాబు, ఎంఎస్ ధోనీ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అప్పటినుంచి సోషల్ మీడియా వేదికగా ఇరువురూ ఒకరికొకరు పలు పోస్టులు పంచుకోవడం, వాటిపై స్పందించడం వంటివి మనం చూశాం. ఇదిలా ఉండగా చాలా రోజుల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిశారు. ఒక యాడ్ షూటింగ్లో భాగంగా కలిసి నటించడం కోసం ఎంఎస్ ధోనీ మరియు యోగిబాబు కలుసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను యోగిబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
— Yogi Babu (@iYogiBabu) October 18, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























