కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న చిత్రం ‘లియో’. త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. బాలీవుడ్ ప్రముఖ నటులు సంజయ్ దత్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ‘విక్రమ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో ‘లియో’ మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా.. జగదీష్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 19న దసరా పండుగ సందర్భంగా ‘లియో’ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మరియు ఎగ్జిబిటర్ల కోసం మంగళవారం ‘లియో’ స్పెషల్ ప్రివ్యూస్ వేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు మరియు తమిళనాడు మినిస్టర్ అయిన ఉధయనిధి స్టాలిన్ కూడా ఈ సినిమాను వీక్షించారు. అనంతరం ‘లియో’పై తన స్పందనను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అందులో ఇలా పేర్కొన్నారు.. “దళపతి విజయ్ అన్న యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మేకింగ్ అద్భుతంగా ఉంది. అలాగే అనిరుధ్ సంగీతం మరియు అన్భుఅరివు యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్సల్ (ఎల్‌సీయూ)కు ఆడియెన్స్ థ్రిల్ అవ్వడం ఖాయం. సెవెన్ స్క్రీన్ స్టూడియో మరియు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్” అని తెలిపారు.
Thalabathy @actorvijay Anna’s #Leo 👍🏽👍🏽 👍🏽@Dir_Lokesh excellent filmmaking , @anirudhofficial music , @anbariv master @7screenstudio 👏👏👏#LCU 😉! All the best team !
— Udhay (@Udhaystalin) October 17, 2023
కాగా ‘లియో’పై ఉదయనిధి ఇచ్చిన ఈ పాజిటివ్ రివ్యూ.. ఈ చిత్రాన్ని వీక్షించడానికి సిద్దమవుతున్న దళపతి అభిమానులను ఉత్తేజపరిచింది. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. అలాగే ప్రివ్యూ చూసిన అనంతరం ‘లియో’ సినిమా గురించి మరికొంతమంది ఎగ్జిబిటర్స్ చేసిన ట్వీట్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టిస్తుందని, దళపతి ఫ్యాన్స్‌కు మంచి యాక్షన్ ట్రీట్‌లా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. దీంతో ‘లియో’ మూవీపై విడుదలకు ముందే సూపర్ హైప్ క్రియేట్ అయింది. అయితే.. ‘లియో’ సినిమా ఎలా ఉండనుందనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























