మంచు వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో మనోజ్. అయితే మనోజ్ కు మాత్రం ఇప్పటివరకూ బ్లాక్ బస్టర్ హిట్ అనేది దక్కింది లేదు. కెరీర్ మొదట్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఈమధ్య సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత కొత్త సినిమాతో రావడానికి సిద్దమవుతున్నాడు. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో మనోజ్ హీరోగా వస్తున్న సినిమా వాట్ ద ఫిష్. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి చాలా రోజులు అయింది. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ వచ్చింది. ఈసినిమాలో వెన్నెల కిషోర్ కూడా ఒకకీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా ఈసినిమా నుండి వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. లుక్ ను చూస్తుంటే మాత్రం ఈసినిమాలో కూడా మరో ఇంట్రెస్టింగ్ రోల్ తో రాబోతున్నట్టు అర్థమవుతుంది.
My AVATAR in #WhatTheFish 🤩🙈..Thanks to @afilmbyv 😁
Exploding soon on the big screens 💥@afilmbyv 🎥@HeroManoj1 #Varun @6ixCinemas #VishalBezawada #SuryaBezawada #Shaktikanth @prosathish pic.twitter.com/XW8gy38jQj
— vennela kishore (@vennelakishore) October 16, 2023
కాగా ఈసినిమాలో మనోజ్ రెండు విభిన్నమైన స్వభావాలు కలిగిన ఒక వ్యక్తిగా కనిపించనున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో అర్థమవుతుంది. ఈసినిమాను విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























