టైగర్ 3 తెలుగు ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టిన సల్మాన్‌ ఖాన్

Salman Khan's Tiger 3 Movie Telugu Trailer Out

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘టైగర్‌ 3’. కత్రినా కైఫ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్‌ మరో కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. కాగా ఈ ‘టైగర్ 3’ చిత్రం బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ‘స్పై యూనివర్స్’ నుంచి వస్తున్న నాలుగో సినిమా కావడం గమనార్హం. ఇంతకుముందు ఇదే తరహా కథాంశంతో 2017లో వచ్చిన టైగర్ జిందా హై, వార్ (2019), పఠాన్ (2023) చిత్రాలు వచ్చాయి. అలాగే సల్మాన్ ఖాన్ నటించిన ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాలకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. మనీశ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దేశభక్తి నేపథ్యంలో పవర్‌ఫుల్ యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రతి ‘ఈద్’ పండుగ సందర్భంగా తన మూవీని రిలీజ్ చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాడు సల్మాన్ ఖాన్. ఈ క్రమంలో ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా నవంబర్‌ 12న దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్, గ్లింప్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా సోమవారం ‘టైగర్‌ 3’ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో సల్మాన్‌, కత్రినా జంట మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైనట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా సల్మాన్‌పై చిత్రీకరించిన ఫైట్‌ సీక్వెన్స్‌లు.. కత్రినా చేసిన బాత్‌ టవల్‌ ఫైట్‌ సీన్‌ నెక్స్ట్ లెవెల్‌ అనిపించేలా ఉన్నాయి.

‘టైగర్‌ 3’ ట్రైలర్‌ ఎలా ఉందంటే..?

దేశంలోని శాంతికి, దేశంలోని శ‌త్రువుల‌కి మధ్య ఎంత దూరం ఉంటుంది? కేవ‌లం ఒక మ‌నిషంత దూరం.. అన్న డైలాగ్‌తో ట్రైల‌ర్ మొద‌ల‌వుతుంది. అయితే ఈసారి సల్మాన్ దేశంతో పాటు తన కుటుంబం కోసం పోరాడనున్నట్లు అర్ధమవుతోంది. ఒక దశలో తన దేశం కావాలో, కుటుంబం కావాలో తేల్చుకోవాల్సిన సంకట స్థితిలో పడిపోతాడు టైగర్. ఈ ప్ర‌య‌త్నంలో టైగ‌ర్‌పై దేశ ద్రోహి అని ముద్ర కూడా ప‌డుతుందని తెలుస్తోంది. ఇక జోయా అనే ఏజెంట్‌గా మరియు సల్మాన్ భార్య పాత్రలో కత్రినా కైఫ్ నటించింది. విలన్ ఇమ్రాన్ హష్మి నటించడం విశేషం. ట్రైలర్ మొత్తం మధ్యమధ్యలో షాడోలో విలన్‌గా కనిపించే ఇమ్రాన్ హష్మి ని.. చివర్లో పరిచయం చేసిన తీరు హైలైట్. ‘వెల్‌కమ్ టు పాకిస్థాన్ టైగర్’.. అంటూ సల్మాన్‌కు స్వాగతం పలుకుతాడు ఇమ్రాన్. కాగా టైగ‌ర్ వ‌ల్ల త‌న ఫ్యామిలీని కోల్పోయిన ఇమ్రాన్ హష్మీ త‌నపై ప‌గ తీర్చుకోవడానికి ప్ర‌య‌త్నిస్తుండ‌టం, దీని నుంచి దేశాన్ని, అదేవిధంగా త‌న‌ ఫ్యామిలీని టైగ‌ర్ ఎలా కాపాడుకున్నాడు అనేది పూర్తి సినిమా స్టోరీ.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.