కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన మ్యాడ్ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కల్లెక్షన్స్ నురాబడుతుంది.మొదటి రోజు కోటి రూపాయలకు పైగా గ్రాస్ తో స్టార్ట్ అయిన ఈసినిమా మౌత్ టాక్ బాగుండడం తో రెండో రోజు అంత కన్నా ఎక్కువ వసూళ్లను రాబట్టింది ఇక మూడో రోజు రెండో రోజుకంటే ఎక్కువగా రాబట్టి 8.4కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది.ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ నుండి వచ్చిన ఈసినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్క్ ను క్రాస్ చేసింది.సినిమా మీద నమ్మకంతో దాదాపు అన్ని ఏరియాల్లో ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫలితంగా ఫుల్ రన్ లో భారీ లాభాలను ఖాతాలో వేసుకోనున్నారు.పండగ వరకు పెద్ద సినిమాలు ఏవి లేకపోవడం కూడా మ్యాడ్ కు కలిసి రానుంది.ఫుల్ రన్ లో 30కోట్ల మార్క్ ను చేరుకున్న ఆశ్చర్యంలేదు.ఇక అటు యూఎస్ఏ లో కూడా సినిమా మంచి వసూళ్లను రాబడుతుంది.ఇప్పటివరకు అక్కడ 200k డాలర్లకు పైగా రాబట్టి హిట్ అనిపించుకుంది.
నార్నె నితిన్,సంగీత్ శోభన్,రామ్ నితిన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈచిత్రంలో గౌరీ ప్రియా,అనంతిక,గోపిక ఉదయన్ హీరోయిన్లు గా నటించారు.మురళీధర్ గౌడ్,రఘు బాబు,విష్ణు ఓయ్ కీలక పాత్రల్లో కనిపించారు.సంగీత్ శోభన్,విష్ణు ఓయ్ కామెడీ సినిమాలో హైలైట్అయ్యింది.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా నిర్మాత సూర్యదేవర నాగ వంశీ చెల్లెలు హారిక సూర్యదేవర,సాయి సౌజన్య ఈసినిమాను నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























