యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ అరవింద సమేత సినిమా తరువాత చాలా కాలానికి ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చింది. అయితే అది మల్టీస్టారర్ సినిమా. ఈనేపథ్యంలో చాలా గ్యాప్ తరువాత ఎన్టీఆర్ సోలో గా వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాకోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు కొరటాల శివ కూడా ఎక్కువ టైమ్ తీసుకొని మరి ఎన్టీఆర్ కోసం సాలిడ్ కథను తయారు చేశాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్లను సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తన సోషల్ మీడియా ద్వారా అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చాడు రత్నవేలు. సెట్ నుండి ఒక ఫొటో పోస్ట్ చేస్తూ.. ఎన్టీఆర్ బ్రో తో దేవర సినిమాలోని మిడ్ సీ నైట్ యాక్షన్ అండర్ వాటర్ సీక్వెన్స్ పూర్తి చేశాం అంటూ తెలిపాడు. ఇక రత్నవేలు ట్వీట్ తో ఎన్టీఆర్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Completed a mammoth mid sea night action .Under water n Surface level filming with @tarak9999 bro 🔥director #koratala siva @anirudhofficial #king Solomon @sabucyril @Yugandhart_ @NTRArtsOfficial @YuvasudhaArts and my team #Devara 🔥@ARRIChannel #Nauticam pic.twitter.com/Bzl6Boj5Tu
— Rathnavelu ISC (@RathnaveluDop) October 1, 2023
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























