మహేష్ బాబు -త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం ప్రస్తుతం నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.అక్టోబర్ కల్లా టాకీ పార్ట్ పూర్తి చేసి నవంబర్ లో సాంగ్స్ షూట్ చేయనున్నారు.ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేసి తీరుతామని నిర్మాత నాగ వంశీ మరోసారి క్లారిటీ ఇచ్చాడు.తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.అందులో భాగంగా గుంటూరు కారం నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకున్నారని తెలిపారు.ఎంత మొత్తానికో చెప్పలేదు కానీ ఎస్ ఎస్ రాజమౌళి సినిమాలు కాకుండా మిగితా సినిమాల్లో కెల్లా హైయెస్ట్ రేటు ఇచ్చి తీసుకున్నారని ఇది నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డు అని వంశీ అన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాల్లో పరుశరాం -విజయ్ దేవరకొండ సినిమా కూడా వుంది. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్.ఈసినిమాను కూడా దిల్ రాజు సంక్రాంతికి తీసుకొస్తున్నాడు.దాంతో గుంటూరు కారంతో పోటీకి తెచ్చి రిస్క్ చేస్తున్నాడు కదా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు వంశీ సమాధానం ఇస్తూ రాజు గారు వస్తారో లేదో అది ఆయన ఎలా ప్లాన్ చేసుకుంటారో ఆయన ఇష్టం.ఈవిషయంలో ఆయనతో చర్చించాల్సింది ఏమిలేదు వస్తే ఎలా ప్లాన్ చేసుకోవాలో రాజు గారికి బాగా తెలుసంటూ నాగ వంశీ చెప్పుకొచ్చాడు.
ఇక సంక్రాంతికి ఈ రెండు సినిమాలే కాదు మరో నాలుగు,ఐదు సినిమాలు కూడా విడుదలకానున్నాయి. మరి గుంటూరు కారం రిలీజ్ ఫిక్స్ అవ్వడంతో ఆసినిమాల నిర్మాతలు రిస్క్ చేస్తారో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: