తలైవా రజనీకాంత్ మొత్తానికి చాలా రోజుల తరువాత జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా రజనీకి మంచి కమ్ బ్యాక్ సినిమా అయింది. మరోవైపు రజనీ మాత్రం హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమా ఉండగా అందులో జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఈసినిమా రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 170వ సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో మరో టాలీవుడ్ హీరో కూడా నటించబోతున్నాడు. దీనికి సంబంధించిన అప్ డేటే ఇప్పుడు ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో టాలీవుడ్ హంక్ అండ్ టాలెంటెడ్ హీరో రానా కూాడా నటిస్తున్నట్టు అధికారింగా ప్రకటించారు. రానా ఈ సినిమాలో జాయిన్ అవ్వడం వల్ల తలైవా 170 టీమ్ ఇంకా చరిష్మాటిక్ గా అయింది అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
Welcoming the dapper & supercool talent 😎 Mr. Rana Daggubati ✨ on board for #Thalaivar170🕴🏼#Thalaivar170Team has gotten even more charismatic 🌟 with the addition of the dashing @RanaDaggubati 🎬🤗✌🏻@rajinikanth @tjgnan @anirudhofficial @ManjuWarrier4 @officialdushara… pic.twitter.com/XhnDpm27CH
— Lyca Productions (@LycaProductions) October 3, 2023
కాగా మంజు వారియర్, రితికా సింగ్ కూడా ఈసినిమాలో నటిస్తున్నారు. అయితే ఈసినిమాలో బిగ్ బీ అమితాబ్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇది నిజమే అయితే దాదాపు 32 ఏళ్ల తరువాత వీరిద్దరి కలిసి నటిస్తున్న సినిమా అవుతుంది. దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే. కాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























