ఓటీటీలోకి బెదురులంక 2012.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Bedurulanka 2012 Movie Out on OTT

టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చి గుర్తింపు పొందిన నేటి జెనరేషన్ హీరోల్లో కార్తికేయ గుమ్మ‌కొండ ఒకరు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కార్తికేయ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అనంతరం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో కార్తికేయ హీరోగా న‌టించిన తాజా చిత్రం ‘బెదురులంక 2012’. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. అజ‌య్ ఘోష్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, స‌త్య, జబర్దస్త్ రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌, సురభి ప్రభావతి, కట్టయ్య, దివ్య నార్ని తదితరులు కీలక పాత్ర‌లు పోషించారు. లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్లాక్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మెలొడీ బ్రహ్మ మణి శర్మ సంగీతం అందించారు. ఇక ఫ‌న్, స‌స్పెన్స్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లనే రాబట్టుకుంది. నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ సినిమా దాదాపు ఎనిమిది కోట్ల‌ వరకు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు డబుల్ ప్రాఫిట్ మిగిల్చింది. ఇక చాలా రోజుల త‌ర్వాత ఈ సినిమాతో సరైన హిట్‌ను అందుకున్నాడు హీరో కార్తికేయ‌. కాగా ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలో రిలీజైంది. ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేట‌ర్ల‌లో విడుద‌లై నెల రోజులు కూడా గడవకముందే బెదురులంక 2012 ఓటీటీలోకి రావ‌డం గ‌మ‌నార్హం. సో.. థియేటర్లలో చుడనివారుంటే.. అమెజాన్ ప్రైమ్‌లో చూసేయండి.

బెదురులంక 2012 కథ ఏంటంటే..?

ఈ సినిమా గోదావరి బ్యాక్‌ డ్రాప్‌లో పూర్తి గ్రామీణ వాతావరణంలో రూపొందింది. బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు నేపథ్యంలో.. అక్కడి ప్రజల్లో ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అనే కథాంశంగా ఈ మూవీ రూపొందింది. ఈ పుకార్ల కార‌ణంగా ఆ ఊరి ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతారు. దీంతో వారిలోని భ‌యం, అమాయ‌క‌త్వాన్ని ఆస‌రాగా చేసుకొని భూష‌ణం (అజ‌య్ ఘోష్‌) అనే లీడ‌ర్, మరో ఇద్దరి (శ్రీకాంత్ అయ్యంగార్‌, జబర్దస్త్ రాంప్రసాద్)తో కలిసి ఊరిని దోచుకోవాల‌ని ప్లాన్ చేస్తాడు. అయితే అత‌డి ప‌న్నాగాన్ని కథానాయకుడు శివ (కార్తికేయ గుమ్మ‌కొండ‌) ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్ర‌మంలో అత‌డికి అక్కడ ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి? మధ్యలో ఊరి ప్రెసిడెంట్ (గోపరాజు రమణ) కుమార్తె చిత్ర‌ (నేహాశెట్టి)తో శివ ప్రేమాయణం సాఫీగా జరిగిందా? లేదా? చివరికి ఊరి ప్రజలు యుగాంతం భయాన్ని ఎలా అధిగమించారు? అనేదే బెదురులంక 2012 మూవీ క‌థ‌.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.