పెద్ద సినిమాలకు లీక్స్ రావడం అనేవి ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో ఒక రకంగా లీకులు బయటపడుతున్నాయి. ఎంతో జాగ్రత్త పడే రాజమౌళికే ఈలీకుల బాధలు తప్పలేదు. రీసెంట్ గా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ నుండి ఏకంగా లిరికల్ సాంగే లీకయ్యింది. దీంతో చిత్రనిర్మాణ సంస్థ కేసు కూడా ఫైల్ చేసింది. ఇప్పుడు మరో పెద్ద సినిమా మేకర్స్ కూడా లీకు రాయుళ్లకు వార్నింగ్ ఇస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898ఏడీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ స్థాయిలో ఈసినిమా తెరకెక్కుతుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. అయితే తాజాగా ఈసినిమా మేకర్స్ లీగల్ ఎలర్డ్ ఇచ్చారు. ఈసినిమా హక్కులన్నీ నిర్మాణ సంస్థకే చెందుతాయి.. ఈ సినిమాలోని ఏదైనా సీన్ కానీ ఫొటో కానీ వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం చట్ట విరుద్ధం. అలా పంచుకుంటే కాపీ రైట్ యాక్ట్ కింద శిక్ష కూడా పడుతుంది అంటూ నోట్ లో పేర్కొన్నారు.
Legal Copyright Notice : #VyjayanthiMovies wishes to inform the public that #Kalki2898AD and all its components are protected by copyright laws. Sharing any part of the film, be it scenes, footage or images, is illegal and punishable. Legal action will be taken as needed, with… pic.twitter.com/wc3rRfRuDJ
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 21, 2023
కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























