మెగా ప్రిన్సెస్ పుట్టిన దగ్గరనుండి తన విషయంలో జరిగే ప్రతి విషయం ఎంతో స్పెషల్ గా ఉంటుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల వివాహం 2012లో జరగగా దాదాపు 11 ఏళ్ల తరువాత వీరిద్దరూ తల్లీదండ్రులైన సంగతి తెలిసిందే కదా. 2023 జూన్ 20 వ తేదీన ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే తన పేరును క్లిన్ కారా గా ఫిక్స్ చేశారు. అంతేకాదు ఆ పాప కోసం స్పెషల్ గా ఫారెస్ట్ థీమ్ తో నర్సరీ కూడా ఏర్పాటు చేయగా ఆ నర్సరీ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక పాప పుట్టి మూడు నెలలు అయిపోయింది. ఇన్ని రోజులు తమ తల్లి దండ్రుల ఇంట్లోనే ఉన్న ఉపాసన ఇప్పుడు చిరు ఇంటికి వెళ్లింది. అయితే మొదటసారి మెగా ప్రిన్సెస్ తమ ఇంట్లో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా చాలా ప్రత్యేకంగా చేశారు. ప్రముఖ ఆద్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి ఆశ్రమానికి చెందిన విద్యార్థుల వేద మంత్రాలతో కిన్ క్లారాను ఆహ్వానించారు. ఇక వినాయక చవితి రోజే క్లిన్ కారా కూడా ఇంటికి రావడంతో రామ్ చరణ్ తన ట్విట్టర్ ద్వారా ఈ ఆనందకరమైన విషయాన్ని పంచుకున్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.. ఈసారి ప్రత్యేకత చిన్ని క్లిన్ కారాతో కలిసి వినాయక చవితి జరుపుకోవడం అంటూ తెలిపాడు.
View this post on Instagram
కాగా ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కియారా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































