ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక అన్నీ అనుకున్నట్టు జరిగిఉంటే ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ కావాల్సింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండటం వల్ల ఈసినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మరోసారి నిరాశకు గురయ్యారు. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా రిలీజ్ గురించి సర్ ప్రైజింగ్ అప్ డేట్ వచ్చింది. ఈసినిమా రిలీజ్ డేట్ పై ఒక పెద్ద హింట్ వచ్చింది. ఆ హింట్ ఇచ్చింది ఎవరో కాదు ఈసినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వైఫ్. ప్రశాంత్ నీల్ వైఫ్ లిఖిత తన ఇన్ట్సా ద్వారా ఈ ఏడాది డిసెంబర్ ఇంతకు ముందులా ఉండదు.. వెయిట్ చేయలేకపోతున్నా అంటూ తెలిపింది. దీంతో ఇది సలార్ సినిమా రిలీజ్ అప్ డేట్ అని ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు. మరి చుద్దాం దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Director #PrashanthNeel wife #LikithaReddyNeel hints about release of #SalaarCeaseFire in the month of December!!🔥💥#Prabhas #SalaarTheSaaga #TeluguFilmNagar pic.twitter.com/ZavI7NHOzN
— Telugu FilmNagar (@telugufilmnagar) September 26, 2023
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”_vX4Lqi5bcs,XOF
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























