కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా దేవర. జనతా గ్యారేజ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా షూటింగ్ ఇటీవలే మొదలుపెట్టి పూర్తి చేస్తున్నారు. ఆమధ్య సినిమాటో గ్రాఫర్ రత్నవేలు కూడా ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉండేవారు. అయితే ఈమధ్య కాస్త సైలెంట్ అయింది చిత్రయూనిట్. అయితే సైలెంట్ గా తమ షూటింగ్ ను పూర్తి చేస్తున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే కదా. అందుకు తగ్గట్టుగానే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈసినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. హాలీవుడ్ మూవీ ‘ట్రాన్స్‌ఫార్మర్స్’కు యాక్షన్ పార్ట్ డిజైన్ చేసిన స్టంట్ మాస్టర్ ‘కెన్నీ బెట్స్’, ఆక్వా మ్యాన్ సినిమాకి VFX డిజైనర్ గా వర్క్ చేసిన ‘బ్రాడ్ మిన్నిచ్’ని ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలోనే ఈసినిమా యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.
దీంతోనే ఫుల్ హైప్ రాగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే ఈసినిమాలో వచ్చే అండర్ వాటర్ సీక్వెన్స్ చిత్రీకరణ కోసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కెమెరా లెన్స్ ను వాడుతున్నారుట. దీంతో షూట్ చేస్తే విజువల్స్ ఓ రేంజ్ లో ఉంటాయని అంటున్నారు. మరి ఆ విజువల్స్ ను ఎక్స్ పీరియన్స్ చేయాలంటే మాత్రం సినిమా వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























