మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ‘మెగా 157’ వర్కింగ్ టైటిల్‌తో ఒక కొత్త చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు చిత్ర దర్శకుడు వశిష్ట సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అందులో.. ” ‘మెగా 157’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. త్వరలోనే మీ అందరినీ సరికొత్త అనుభూతినిచ్చే సినిమాటిక్ అడ్వెంచర్‌కు తీసుకెళ్లేందుకు మేము సిద్ధం” అని వశిష్ట పేర్కొన్నారు. ఈ సందర్భంగా వశిష్ట ‘మెగా 157’ టీమ్‌తో కలసి దిగిన ఫొటోను షేర్ చే శారు. కాగా ఈ సినిమా సోషియో ఫాంటసీగా రూపొందనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పంచభూతాల నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున విడుదల చేసిన పోస్టర్ ద్వారా దర్శకుడు వశిష్ట వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ విజువల్ గా కట్టిపడేస్తుంది. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం (పంచభూతాలు) నక్షత్ర ఆకారపు ఎలిమెంట్, త్రిశూలంతో ఆవరించి ఉండటం ఆసక్తికరంగా ఉంది. ఇక తన తొలి చిత్రం ‘బింబిసార’తో మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన వశిష్ట.. మరోసారి మెగాస్టార్ మూవీతో అలాంటి మేజిక్ నే రిపీట్ చేయనున్నారు. అయితే చిరంజీవి ఇంతకుముందు పలు సోషియో ఫాంటసీ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. యముడికి మొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి తదితర సినిమాలు చేసి ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించారు.
వచ్చేనెల నుంచి ఈ మూవీ రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే..? ఈ చిత్రంలో చిరు సరసన ఎక్కువమంది కథానాయికలు నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి టాలీవుడ్ సీనియర్ కెమరామెన్ ఛోటా కె. నాయుడు డీవోపీగా పనిచేయనుండగా.. ఆస్కార్ విన్నర్, నేషనల్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇంకా చిత్రానికి పనిచేయనున్న ఇతర టెక్నీషియన్ల వివరాలను చిత్రబృందం త్వరలోనే ప్రకటించనుంది. అలాగే యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ‘మెగా 157’ చిరంజీవి కెరీర్‌లోనే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ చిత్రంగా వుండబోతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























