కింగ్ నాగార్జున 99వ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది.ఈసినిమాకు నా సామి రంగ అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఈసినిమాతో డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.నాగ్ బర్త్ డే సందర్భంగా ఈరోజు ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశార.ఇక ఈ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా వుంది.ఈ సినిమాలో నాగ్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Naa Saami Ranga🤟
Ippudu #KingMassJataraమొదలు 🔥🔥
Our next with the King 👑@iamnagarjuna garu titled #NaaSaamiRanga 💥
World Wide Release on Sankranti 2024🤩
Here's the Title Glimpse
➡️ https://t.co/0PuVDhdykA#HBDKingNagarjuna 🎊@ChoreographerVJ @mmkeeravaani… pic.twitter.com/5k88K8XNei
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 29, 2023
రూరల్ బ్యాక్ డ్రాప్ లో మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో పలాస 1978డైరెక్టర్ కరుణ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు.అయితే హీరోయిన్ ను ఫైనల్ చేయాల్సివుంది.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ఫై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు.వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలకానుంది.ఇక చాలా రోజుల నుండి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు నాగార్జున. మరి ఈసారైనా నా సామి రంగ తో సక్సెస్ కొట్టి ట్రాక్ లోకి వస్తాడో లేదో చూడాలి.
ఇదిలావుంటే నాగార్జున బర్త్ డే సందర్బంగా ఈరోజు మన్మథుడునురీ రిలీజ్ చేశారు.విజయ్ భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమా 2002 లో వచ్చి కల్ట్ సినిమా ల జాబితాలో చేరిపోయింది.ఈసినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ, డైలాగ్స్ అందించాడు.అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























