గుంటూరు కారం వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుందని రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ లో మహేష్ బాబు చెప్పిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లు గానే షూటింగ్ జరుగుతుంది. ఇటీవలే హాలిడే కు ఫారెన్ కు వెళ్లి తిరిగి వచ్చిన మహేష్ షూటింగ్ తో బిజీ అయ్యాడు.కొన్ని రోజుల క్రితం గుంటూరు కారం కొత్త షెడ్యూల్ స్టార్ట్ కాగా నిన్నటి తో ముగిసింది.ఈషెడ్యూల్ లో మహేష్ మూడు రోజులు పాల్గొన్నాడు.కొన్ని ఎమోషనల్ సీన్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారట.ఇక రేపటి నుండి సారథి స్టూడియోలో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా సెన్సేషనల్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించనుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు.పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈసినిమాను హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.ఇక ఈసినిమా తరువాత మహేష్,తన తదుపరి చిత్రాన్ని ఎస్ ఎస్ రాజమౌళి తో చేయనున్నాడు.వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























