ఆమె కోసం పదేళ్లయినా వెయిట్ చేసేవాళ్లం అంటున్నారు ఖుషి చిత్రయూనిట్. మరి ఇంతకీ ఆమె ఎవరో ఇప్పటికే ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. ఎవరో కాదు స్టార్ హీరోయిన్ సమంత. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా వస్తున్న సినిమా ఖుషి. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అన్నప్పుడే ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలను ఏర్పడ్డాయి. అందులోనూ అప్పటికే మహానటి సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడటంతో ఈసినిమాను ఎప్పుడు సిల్వర్ స్క్రీన్ పై చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పాటలతోనే సినిమాకు రావాల్సినంత బజ్ వచ్చేసింది. తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా ట్రైలర్ అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సమంత గురించి అడుగగా దానికి సమాాధానంగా.. ఈసినిమా షూటింగ్ సగం పూర్తయిన తరువాత సమంతకు హెల్త్ ఇష్యూ వచ్చిందని తెలిసింది.. అయితే తను రికవర్ అయిన తర్వాత షూటింగ్ చేద్దామని శివ తో చెప్పాను. అవసరమైతే సమంత కోసం పదేళ్లపాటైనా షూటింగ్ ను హోల్డ్ లో పెట్టేవాళ్లం అంటూ తెలిపాడు.
ఈసినిమాలో మురళి శర్మ,రాహుల్ రామకృష్ణ,రోహిణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్లా వాహబ్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో వున్న ఈసినిమా సెప్టెంబర్ 1న తెలుగుతోపాటు హిందీ,తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























