హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి సినిమాను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమాను ప్రకటించిన తరువాత సెట్స్ పైకే చాలా లేట్ గా వెళ్లింది. ఇక ఎలాంటి బ్రేక్స్ లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది అనుకున్నారు. అలా సెట్స్ పైకి వెళ్లి ఫస్ట్ షెడ్యూల్ ను చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ కు మాత్రం మళ్లీ లాంగ్ గ్యాప్ వచ్చేసింది. ఈనేపథ్యంలో ఈసినిమా షూటింగ్ పై అలానే రిలీజ్ పై మళ్లీ పలు రూమర్లు మొదలయ్యాయి. దీంతో ఈవార్తలకు క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా వాల్తేరు వీరయ్య 200 డేస్ సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకలో పాల్గొన్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ రూమర్లపై స్పందిస్తూ.. ఉస్తాద్ భగత్ సింగ్ పై వస్తున్న వార్తల్లో నిజం లేదు.. సినిమా ఆగిపోయేది లేదు.. త్వరలోనే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టనున్నాం.. వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా.. సమ్మర్ రేసులో ఈసినిమా ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి రీసెంట్ గానే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా పవర్ స్టార్ స్వాగ్, డైలాగ్, లుక్ కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈసినిమా కూడా సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని అంటున్నారు. కాగా ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























