న్యాచురల్ స్టార్ నాని మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది ఇప్పటికే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీ వచ్చేస్తున్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. దసరా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత నాని నుండి వస్తున్న సినిమా.. మరోవైపు సీతారామం లాంటి క్లాసిక్ హిట్ తరువాత మృణాల్ ఠాకూర్ చేస్తున్నసినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమాలో కూడా నాని డిఫరెంట్ పాత్రలో నటించనున్నాడు. 6ఏళ్ల కూతురికి తండ్రిగా ఈసినిమాలో నటించనున్నాడు. తండ్రి కూతుళ్ల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఈసినిమా వస్తున్నట్టు అర్థమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను గ్లింప్స్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. హాయ్ నాన్న అనే టైటిల్ ను ఈసినిమా కోసం ఫిక్స్ చేశారు మేకర్స్. ఇదిలా ఉండగా తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. నేడు ఈసినిమాలో నటిస్తున్న మృణాల్ బర్త్ డే సందర్భంగా ఆమెకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది.
Wishing a very Happy Birthday to the one and only @MissThakurani 🎉 Your charm and talent know no bounds. May you continue to rule our hearts forever! ❤️🔥 Team #HiNanna #NaturalStar🌟 @NameisNani @shouryuv @HeshamAWMusic @SJVarughese @mohan8998 @drteegala9 @kotiparuchuri… pic.twitter.com/Zi5NmNTtGs
— Vyra Entertainments (@VyraEnts) August 1, 2023
ఇక ఈసినిమాలో నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.వి.మోహన్, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈసినిమాను డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































