సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నప్పటినుండే సితార తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. చిన్నప్పుడే యూట్యూబ్ ఛానెల్ ను పెట్టేసి తన వీడియోలతో అలరించింది. ఇక ఆ తరువాత ఇన్ట్సాలో కూడా జాయిన్ అయి తన అకౌంట్ ద్వారా పలు వీడియోలు, ఫొటోలు పంచుకుంటూనే ఉంది. సర్కారు వారి పాట సినిమాతో ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. ఇలా చిన్న వయసులో సితార మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు తాజాగా మరో రికార్డ్ ను సొంతం చేసుకుంది సితార. ఇంత చిన్న వయసులో ప్రముఖ జ్యూవెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. తాజాగా ఆ యాడ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. వీడియోలో సితార నటనతో ఆకట్టుకుంటుంది. దీంతో యాడ్ చూసిన తరువాత సితారపై పొగడ్తలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు కూతురి యాడ్ పై తండ్రి మహేష్ కూడా తన సోషల్ మీడియాలో స్పందించారు. ఇంత బ్యూటిఫుల్ టాలెంట్ ను చూస్తే చాలా గర్వంగా ఉంది అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు. మొత్తానికి సితార మాత్రం తండ్రికి తగ్గ తనయురాలు అంటూ కితాబులు అందుకుంటుంది.
View this post on Instagram
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























