రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాను ప్రకటించిన దగ్గరనుండే సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ చేయాలో తనకు తెలుసు. ఇక కొంతకాలంగా రామ్ గోపాల్ వర్మ ఏపీలోని పొలిటికల్ లీడర్స్ పై సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అంతేకాదు ఈసినిమా ఇప్పటికే 50శాతం వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు అలానే టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. రామ్ గోపాల్ వర్మ టెక్నికల్‌గా తమ పోస్టర్లతో కథను చెప్పి ట్రెండ్ చేయగల పోస్టర్ డిజైనర్స్ అనిల్ అండ్ భాను అంటూ తెలుపుతూ ఈ ఇంటెన్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. జగన్ పాత్రను పోషించిన అజ్మల్ తనపై జరిగిన కుట్రలకి ఎలా స్పందిస్తున్నారో తెలియచేసేలా ఉంది ఈ పోస్టర్.
VYOOHAM poster designs have been done by the incredibly talented duo of @anilandbhanu ..Film is produced by @dkkzoomin and the target audience is TDP, JS and the general public 💐💪 pic.twitter.com/7gNLafXZLl
— Ram Gopal Varma (@RGVzoomin) July 16, 2023
కాగా ఈసినిమాను రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్నారు. జగన్ పాత్రలో అజ్మల్ నటిస్తుండగా.. వైయస్.భారతీ పాత్రలో మానస నటిస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా సుజీష్ రాజేంద్రన్, ఎడిటర్ గా మనీష్ ఠాకూర్ పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























