న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై ప్రాజెక్ట్ K

prabhas project k movie on times square billboard

ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రాజెక్ట్ కే గురించిన చర్చలే వినిపిస్తున్నాయి. ఈసినిమా నుండి అప్ డేట్స్ రానున్న నేపథ్యంలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుండటంతో.. ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే కదా ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రాజెక్ట్ కే అనే టైటిల్ తోోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఇంట్రెస్టింగ్ వీడియోలు రిలీజ్ చేస్తూ హైప్ ను పెంచుతున్నారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక గతకొద్దిరోజులుగా ఈసినిమా కు సంబంధించిన వార్తలన్నీ వైరల్ అవుతున్న సంగతి కూాడా విదితమే. దానికి కారణం ప్రాజెక్ట్ కే టీమ్ అమెరికాలో జరగనున్న శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో పాల్గొనడం ఒక ఎత్తైతే అక్కడ ప్రాజెక్ట్ కే టైటిల్ ను రిలీజ్ చేయడమే. వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కే పేరుతో ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ఇప్పటికే కన్ఫామ్ చేసింది కూడా. యూఎస్ఏ లో జులై 20వ తేదీన ఇండియాలో జులై 21వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పుడు ఈసినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. టైమ్ స్కేర్ పై ఈ సినిమాను ప్రదర్శించారు. అందులో ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను జులై 20 వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టు మరోసారి తెలిపారు.

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో అమితాబ‌చ్చ‌న్ ఇంకా దిశా పటాని కూడా న‌టిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుక‌గా 2024 జ‌న‌వ‌రి 12న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.