శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటిగా నిలిచింది. తీసిన సినిమాలన్నీ హిట్టవ్వడం.. అవి కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడం.. వరుస పెట్టి సినిమాలు తీస్తుండటంతో ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ బ్యానర్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు పలు సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇక ఈ ఏడాది అప్పుడే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా మైత్రి మార్క్ ని ఇంకాస్త పెంచాలని చూస్తున్నారు ప్రొడ్యూసర్స్. ఈనేపథ్యంలోనే మలయాళం లోకి ఎంట్రీ ఇస్తుంది. మలయాళం యంగ్ హీరో టొవినో థామస్ హీరోగా నటిస్తున్న ఈసినిమాను డ్రైవింగ్ లైసెన్స్ తో పేరు తెచ్చుకున్న దర్శకుడు లాల్ జూనియర్ డైరెక్ట్ చేస్తున్నారు. నడికర్ తిలకం అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఇక ఈసినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఈరోజు నుండే మొదలుపెట్టారు.
Super excited and delighted for our project with the supremely talented Malayalam superstar @ttovino and @soubinshahir ❤🔥#NadikarThilakam shoot begins ❤️
Helmed by the blockbuster director of #DrivingLicense #LalJr 💥
Co- Produced by @godspeedoffcl. pic.twitter.com/XrLbON5WtZ
— Mythri Movie Makers (@MythriOfficial) July 12, 2023
కాగా ఇంకా ఈసినిమాలో దసరా సినిమాతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయళ నటుడు టామ్ చాకో కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే నేహా నైర్ ని సంగీతం అందిస్తున్నారు. మరి ఇక్కడ సక్సెస్ ఫుల్ బ్యానర్ గా పేరు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్ వారు అక్కడ ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























