కంటెంట్ ఉన్న సినిమాలకు ఈమధ్య ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూస్తూనే ఉన్నాం. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా కొత్త కొత్త ఐడియాస్ తో వస్తున్నారు. ఇక సినిమా బాగుంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఇప్పుడు అలాంటి కంటెంట్ ను నమ్ముకునే ఒక సినిమా రాబోతుంది. ఆసినిమానే సుందరం మాస్టర్. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో హర్షచెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా సుందరం మాస్టర్. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఈసినిమా పై క్యూరియాసిటీని పెంచారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు. సాయిధరమ్ చేతుల మీదుగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టీజర్ ను బట్టి ఈసినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నట్టు అర్థమవుతుంది. టీజర్ ను బట్టి హర్ష ఓ గిరజన ప్రాంతానికి టీచర్ గా వెళతాడు. ఇక అక్కడ హర్ష వారికి ఇంగ్లిష్ నేర్పించడానికి ట్రై చేస్తుంటే వారే తన కంటే ఫాస్టుగా ఇంగ్లీష్ మాట్లాడటంతో షాకవుతాడు. హర్ష అంకా వారి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వు తెప్పించేలా ఉన్నాయి. మరి టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.
Our #SUNDARAMMASTER is here :)))
Happy to bring you all the teaSIR of our SM featuring my boy @harshachemudu 🤗
– https://t.co/wDuLz20mVC@SudheerKurru @kalyansanthosh8 @itswetha14 @NambuShalini @SricharanPakala @RTTeamWorks @GOALDENMEDIA pic.twitter.com/nhcg3Z8zQO
— Ravi Teja (@RaviTeja_offl) July 11, 2023
రవితేజ టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్లపై రవితేజ, సుధీర్‌కుమార్ కుర్రు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. మరి చూద్దాం ఈసినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























