గత ఏడాది గని, ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమాాను ఆగష్ట్ 25వ తేదీన రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటినుండే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ప్రీ టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. రేపు అంటే జులై 12వ తేదీన ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ప్రీ టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు చిత్రనిర్మాణ సంస్థ అధికారికంగా తెలియచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Buckle up and hold on tight for an adrenaline-fueled ride 😎
Unleashing the Horsepower of Arjuna’s chariot🔥#GandeevadhariArjuna PRE TEASER TOMORROW @ 10:08 AM💥#GDAonAugust25th
Mega Prince @IAmVarunTej @sakshivaidya99 @PraveenSattaru @MickeyJMeyer @BvsnP @SVCCofficial pic.twitter.com/NB0HUp4ioE
— SVCC (@SVCCofficial) July 11, 2023
కాగా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈసినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. ముఖేష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























