ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలను అందించిన సీనియర్ డైరెక్టర్లు ఈమధ్య కాలంలో సైలెంట్ అయిపోయారు. దానికి కారణం కూడా లేకపోలేదు. కొత్త కొత్త డైరెక్టర్లు వస్తుండటం.. ప్రేక్షకులు కూడా సినిమాలు చూసే విధానం మారడంతో చాలామంది డైరెక్టర్లు సైలెంట్ అయిపోయారు. అయితే కొంతమంది మాత్రం మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఎం.ఎస్ రాజు చాలా గ్యాప్ తరువాత దర్శకుడిగా మారి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు మరో డైరెక్టర్ కూడా కమ్ బ్యాక్ ఇవ్వనున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలని అందించిన మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె. విజయభాస్కర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చాలా విరామం తర్వాత విజయభాస్కర్ యూత్ ఫుల్ ఫన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. ‘జిలేబి’ అనే డిఫరెంట్ టైటిల్ తో ఈసినిమా వస్తుంది. విజయభాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. జులై 21వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
కాగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇంకా శ్రీకమల్, మురళీ శర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి తదితరులు పలు పాత్రల్లో నటిస్తున్నారు.ఈసినిమాను అంజు అశ్రాని సమర్పిస్తున్న ఈసినిమాను ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్ గా, ఎం.ఆర్. వర్మ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























