ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి వాటిలోనే పూరీ జగన్నాథ్ ఇంకా రామ్ పోతినేనిది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ లో పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించి, తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు రామ్. పూరి జగన్నాథ్ స్టోరీ, రామ్ ఎనర్జీ, మణిశర్మ సంగీతం చిత్ర విజయానికి ప్లస్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే అధికారిక ప్రకటన కూాడా ఇచ్చారు. అయితే తాజాగా ఈసినిమాను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు మేకర్స్. ఛార్మి క్లాప్ కొట్టగా, రామ్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 12 నుంచి ప్రారంభం అవుతుంది. డబల్ ఇస్మార్ట్ గా రాబోతున్న ఈసినిమాను డబుల్ మాస్, డబుల్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించబోతున్నారు. అంతేకాదు ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేశారు. 2024 మార్చి 8వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. కాగా ఈసినిమాను పూరి కనెక్ట్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.
With the blessings of Lord Shiva 🔱
The Pooja ceremony of #DoubleISMART commenced in Hyderabad 🪔
Ustaad @ramsayz 🤗
Dashing Director #PuriJagannadh 🤩Shoot Begins on July 12th❤️🔥
Mass Action Entertainer at the cinemas on MARCH 8th, 2024💥@IamVishuReddy @PuriConnects pic.twitter.com/jIAVL36ljk
— Charmme Kaur (@Charmmeofficial) July 10, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























