ఉస్తాద్ షూటింగ్ కంప్లీట్

sri simha ustaad movie shooting wrapped up

శ్రీసింహా మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే భాగ్ సాలే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీసింహా. ఈసినిమా కూడా సరైన విజయాన్ని అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేయడానికి సిద్దమైపోయాడు. ఫణదీప్ దర్శకత్వంలో శ్రీ సింహా హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్. ఇక ఇన్నిరోజులు షూటింగ్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఒకపక్క షూటింగ్ జరుపుతూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ కూడా రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫైనల్ గా ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వార తెలియచేసింది. అంతేకాదు ఆగష్ట్ 12వ తేదీన థియేటర్లలో కలుద్దాం అంటూ రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తుంది. మసూద, బలగం సినిమాలతో ప్రస్తుతం కావ్య కూడా ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. వారాహి చలన చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. అకీవా బి సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.