మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ అనే టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. ఇక లెజెండరీ డైరెక్టర్, స్టార్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. అయితే గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా సడెన్ గా బ్రేకులు పడ్డాయి. ఉపాసన డెలివరీ కూడా ఉండటంతో చరణ్ కూడా షూట్ కు బ్రేక్ ఇచ్చాడు. ఇక చాలా గ్యాప్ రావడంతో మళ్లీ సినిమా షూట్ ను మొదలుపెట్టనున్నారు. ఈ సినిమా బ్యాలన్స్ షూటింగ్ ను జులై 10 లేదా 11 నుంచి రీస్టార్ట్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఇక ఈ షెడ్యూల్ లో శంకర్ పలు భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారట.. అంతేకాదు వీటితోపాటు ముఖ్య తారాగణంతోపాటు పలు ఇంపార్టెంట్ సీక్వెన్స్ లను తెరకెక్కించనున్నారట. అలాగే షెడ్యూల్ అంతా కూడా హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































