సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా వచ్చిన సినిమా మామన్నన్. తమిళ్ లో పొలిటిల్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమాను రూపొందించారు. ఈసినిమా అక్కడ సూపర్ హిట్ టాన్ ను తెచ్చుకుంది.
ఇక ఇప్పుడు ఈసినిమాను తెలుగులోకి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగులో నాయకుడు అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఈసినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థలు సురేష్ ప్రొడక్షన్స్ వారు అలాగే ఆసియన్ సినిమాస్ వారు సొంతం చేసుకోగా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. జులై 14వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. నేను పాడుతున్న పాట ఒకే పాట అయ్యిండాలి. ఆ పాట నేను జీవితాంతం పాడుతూ వుండాలి. నా పొట్ట నుంచి పేగులు తీసి దానితో వీణ చేసి దాన్ని వీధి వీధిన మీటుతున్నాను. నిజాన్ని వినే చెవుల్ని నేను వెదుకుతున్నాను” అనే ఇంటెన్స్ వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం హార్డ్ హిటింగ్ గా సాగింది. వడివేలు, ఉదయనిధి స్టాలిన్ కొండపై నిలబడి నగరాన్ని చూస్తుండగా, తుపాకీ పేల్చి ఫహద్ ఫాసిల్ పాత్ర పరిచయం అవుతుంది. వడివేలు, ఉదయనిధి ఒకవైపు, ఫహద్ మరోవైపు.. వీరి మధ్య పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతుందని ట్రైలర్ ఎస్టాబ్లిష్ చేసింది. వడివేలు, ఉదయనిధి స్టాలిన్, ఫహద్ ఫాసిల్ ల ఫెర్ ఫార్మెన్స్ ఎక్స్ టార్దినరిగా వుంది. కీర్తి సురేష్ కీలక పాత్రలో ఆకట్టుకున్నారు
#Nayakudu Looks like an edge-of-the-seat thriller! Best wishes to the talented team!
In cinemas from July 14thhttps://t.co/fATDWx0t1y@Udhaystalin @KeerthyOfficial #FahadhFaasil @mari_selvaraj @AsianCinemas_ @SureshProdns
— Mahesh Babu (@urstrulyMahesh) July 7, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























