పండగ సీజన్లు వస్తున్నాయంటే సినీ లవర్స్ కు పండగే. కొత్త కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాయి కాబట్టి అదే వారికి అసలైన పండగ. ఇక ఈ ఏడాది ఇప్పటికే సంక్రాంతి అయిపోయింది. పలు సినిమాలు సందడి చేశాయి. కొన్ని బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకున్నాయి.. కొన్ని బోల్తా కొట్టాయి. ఇక ఇప్పుడు సమ్మర్ సీజన్ కూడా అయిపోయింది. అయితే సెప్టెంబర్ లో మాత్రం సినీ లవర్స్ కు మాస్ జాతరే ఇవ్వనున్నారు. అది కూడా పాన్ఇండియా సినిమాలు రిలీజ్ అవుతుండటం విశేషం. ఒకటి కాదు రెండు కాదు దాదాపు డజనుకు పైగా సినిమాలు సందడికి సిద్దమవుతున్నాయి. వాటిలో కూడా హై ఎక్స్ పెక్టేషన్స్ అలానే దేశవ్యాప్తంగా ఎదురుచూసే సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సలార్.. పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ హీరోగా సలార్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు కె.జి.యఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈసినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈసినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదే డేట్ కు రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

జవాన్.. పఠాన్ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు షారుఖ్ ఖాన్. ఇక ఇప్పుడు జవాన్ తో రాబోతున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈసినిమాా వస్తుంది. ఈసినిమా ను మొదట జూన్ 2వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఆ తరువాత జూన్ ఎండింగ్ కు మార్చారు. ఇక రీసెంట్ గా అది కూడా మార్చి కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 7వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గౌరీఖాన్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

RAPO20.. ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్నసినిమా రాపో 20. ప్రస్తుతానికి ఇదే వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. ఇక ఈసినిమాను ముందు అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్చారు. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. రిలీజ్ డేట్ ను ఒక నెలరోజుల ముందుకు జరిపారు మేకర్స్ సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ తో వస్తున్న ఈసినిమా పై కూడా ఎక్స్ పెక్టేషన్స్ చాలా ఉన్నాయి.

ఖుషి.. సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతున్న మొదటి సినిమా విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా వస్తున్న ఖుషి సినిమా. శివ నిర్వాణ దర్శకత్వంలో ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ ముగించుకుంటున్న ఈసినిమా సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు.
మరి సెప్టెంబర్ ఫస్ట్ నుండి ఎండింగ్ వరకూ వరుసగా పాన్ ఇండియా సినిమాలు అలరించనున్నాయి. మరి వీటిలో ఎన్ని సినిమాలు సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”_vX4Lqi5bcs,XOF
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























