10 సినిమాలే చేస్తా.. తర్వాత గుడ్ బై

I Will Quit Movies After Doing 10 Films says Lokesh Kanagaraj

తమిళ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్ కూడా ఉన్నాడు. తన డిఫరెంట్ మేకింగ్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చిపెట్టి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ చేసింది. మానగరం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ మొదటి సినిమాతోనే ఇంపాక్ట్ చూపించాడు. ఇక ఆతరువాత వచ్చిన ఖైదీ సినిమా ఒక్కసారిగా లోకేష్ కనగరాజ్ కు స్టార్ డైరెక్టర్ ను చేసింది. ఇక ఖైదీ సినిమా తరువాత ఏకంగా స్టార్ హీరో విజయ్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. విజయ్ తో మాస్టర్ సినిమా చేశాడు అయితే ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మాస్టర్ తరువాత విలక్షణ నటుడు కమల్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. కమల్ తో విక్రమ్ సినిమా తీశాడు.. ఇక ఈసినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ కొట్టిందో చూశాం. దాదాపు 500 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది ఈసినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి సినిమా సినిమాకు వైవిధ్యతను చూపించుకుంటూ డిఫరెంట్ కథలను తెరకెక్కిస్తున్న లోకేష్ సినిమాలు తీయడం మానేస్తే ఎలా ఉంటుంది. ఈ మాట వినడానికి అభిమానులతో పాటు ప్రతి సినీ ప్రేక్షకుడికి కూడా కాస్త బాధగానే ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ కనగరాజ్ తన సినీ కెరీర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తనకు ఎక్కువ సినిమాలు చేయాలనే ఆలోచన లేదని వెల్లడించారు. నా కెరీర్‌లో మరిన్ని సినిమాలు చేసే ఆలోచన లేదు. కేవలం 10 సినిమాలు చేయాలి అనుకుంటున్నాను. 10 పూర్తి కాగానే ఫిల్మ్ మేకింగ్ నుంచి సెలవు తీసుకోవాలి అనుకుంటున్నాను. మరి లోకేష్ కనగరాజ్ లియో తో కలిపి ఐదు సినిమాలు తీశాడు. ఇంకా 5 సినిమాలు చేసి తప్పుకుంటాడా అని అంటున్నారు. అంతేకాదు లోకేష్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. లోకేష్ టాలెంట్ ఉన్న డైరెక్టర్.. ఆయన లాంటి డైరెక్టర్ ఇంకా మంచి సినిమాలు తీయాలి.. ఈ నిర్ణయం సరైనది కాదు అంటూ తమ అభిప్రాయాలను తెలియచేస్తున్నారు. మరి చూద్దాం లోకేష్ నిర్ణయం ఎలా ఉంటుందో..

ప్రస్తుతం విజయ్ తోనే లియో సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.