సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యేష నాగుల సాంగ్

The Paradise second single out now

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’నుంచి ఫుల్ మాస్ ఫోక్ ఆంథమ్ “యేష నాగుల కట్ట మీద”సాంగ్ విడుదలైంది. ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ సెన్సేషనల్ హిట్ అవ్వగా సెకండ్ సింగిల్ గా వచ్చిన యేష నాగుల కట్ట మీద కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుంది. ఈపాటలో నాని సరసన కీర్తి సురేష్ స్టెప్పులు వేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పక్కా తెలంగాణ ఫోక్ అండ్ ఊరమాస్ బీట్స్‌తో సాగిన ఈ పాటలో నాని, కీర్తి సురేష్ తమ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో అదరగొట్టారు. వీరిద్దరి మధ్య ఉన్న మాస్ కెమిస్ట్రీ విజువల్స్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన ఊపుతెప్పించే ట్యూన్, హై-వోల్టేజ్ మాస్ బీట్స్ వినగానే ఆకట్టుకునేలా ఉన్నాయి.కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగ తెలంగాణ ఫోక్ సింగర్స్ జంగి రెడ్డి , ప్రభావతి వోకల్స్ అందించారు.

భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ పాట విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.’దసరా’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాను ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.మొత్తానికి సాంగ్స్ తోనే సినిమాకు ఎక్కడా లేని హైప్ వస్తుంది. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 24న థియేటర్లోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.